
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో కర్నాటకలోని ఉడిపి జిల్లా కర్కాలా ప్రాంతంలో విషాద ఘటన నెలకొంది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు కూలి పలుచోట్ల వాహనాలు ధ్వంసం అయ్యాయి. బెల్మన్నులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు పడటంతో బైకర్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. మృతుడిని పిలార్ ఖానా ప్రాంతానికి చెందిన ప్రవీణ్ గా గుర్తించారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమేరాలో రికార్డైంది. దీంతో సంఘటన జరిగిన ప్రాంతంలో సుమారు గంట సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు.. ఆ రహదారిపై పడిన చెట్లను తొలగించేందుకు కర్కలపాడు బిద్రి రహదారిని బ్లాక్ చేశారు.