నేపాల్ కేంద్రంగా భూకంపం.. ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు.. భయంతో పరుగులు పెట్టిన జనం..

నేపాల్ కేంద్రంగా భూకంపం.. ఢిల్లీలో మళ్లీ భూప్రకంపనలు.. భయంతో పరుగులు పెట్టిన జనం..

ఢిల్లీలో మళ్లీ భూకంపం సంభవించింది. సోమవారం (నవంబర్ 06) సాయంత్రం 4.20 కి ఢిల్లీ-ఎన్ సీఆర్,  లక్నో, రీజియన్ లో భూ ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ కూడా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6 గా నమోదు అయింది. ఢిల్లీలో గత మూడు రోజుల్లో భూమి కంపించడం ఇది రెండోసారి. హిమాలయ కౌంటీ కేంద్రంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. భూమి అంతరంలో 10 కిలోమీటర్ల లోతుల్లో  భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.