Triptii Dimri: యానిమల్‌కి ముందు, తర్వాత.. త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్‌ లెక్కేంతో తెలుసా!

Triptii Dimri: యానిమల్‌కి ముందు, తర్వాత.. త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్‌ లెక్కేంతో తెలుసా!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర యానిమల్(Animal) ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా  తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తో పాటు త్రిప్తి డిమ్రి (Triptii Dimri) నటించింది. 

ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమా విడుదలైనప్పటి నుండి ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రి వైరల్ అవుతోంది. సినిమాలో కనిపించింది చిన్న పాత్రలో అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. యానిమల్ హిట్ తో త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఆమెకు యానిమల్ సినిమా రిలీజ్ కు ముందు..అంటే నవంబర్‌ చివరి వారంలో 6లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా..ప్రస్తుతం ఆ సంఖ్య 30లక్షలకు చేరింది. ఇప్పటికే మీకు అర్ధం అయ్యి ఉంటది..ఈ లెక్క రోజురోజుకూ అమాంతం పెరుగుతూ వెళ్తోంది.

 

 

ఇక 2015లో త్రిప్తి ఇన్‌స్టా ఫ్యామిలీలోకి అడుగుపెట్టగా..అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తనదైన గ్లామర్ ఫొటోస్ తో పాటు, రీల్స్‌తోనూ ఆమె సందడి చేస్తోంది. యానిమల్ క్రీజ్ తో ఇప్పుడు గతంలో ఉన్న  ఆమె పోస్ట్‌లు అన్నింటికి లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.