స్టార్ హీరోతో ప్రేమ? కలిసి జైలర్ సినిమాకు

స్టార్ హీరోతో ప్రేమ? కలిసి జైలర్ సినిమాకు

చెన్నై బ్యూటీ త్రిష(Trisha) సెకండ్​ ఇన్నింగ్స్​లో జోరు పెంచింది. దాంతో పాటే రూమర్లు కూడా ఆమె వెంటే ఉంటున్నాయి. తాజాగా  రజనీకాంత్(Rajinikanth)​ జైలర్(Jailer)​ సినిమా విడుదల కారణంగా మరోసారి ఈ బ్యూటీ పేరు వార్తల్లో నిలిచింది. కోలీవుడ్​ హీరో ధనుశ్(Danush)​తో త్రిష ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ధనుశ్​ జైలర్​ సినిమాను థియేటర్లో చూసేందుకు వెళ్లాడు. థియేటర్లో వీరిద్దరూ రచ్చ చేశారంటూ కొన్ని ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.

ధనుశ్​ థియేటర్​కి వెళ్లాడు కానీ, త్రిషతో కలిసి వెళ్లలేదని ఫ్యాన్స్​ క్లారిటీ ఇస్తున్నారు. ఇవి లేటెస్ట్​ ఫొటోలు కాదని.. గతంలో ఈ స్టార్లు కలిసి ‘పెట్టా’లో నటించారు. ఆ సినిమాను చూసేందుకు కలిసి వెళ్లారు. ఆ టైంలో తీసిన ఫొటోలనే ఇప్పుడు కొందరు కావాలని వైరల్​ చేస్తున్నారని ఫ్యాన్స్​ అంటున్నారు. రజనీ కుమార్తె ఐశ్వర్యను పెళ్లాడిన ఈ హీరో ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నాడని టాక్​.