గులాబీ రంగు చీర కట్టుకుని… కారుకు ఓటేయమంటున్న పోలింగ్ ఏజెంట్

గులాబీ రంగు చీర కట్టుకుని… కారుకు ఓటేయమంటున్న పోలింగ్ ఏజెంట్

మంచిర్యాలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.  మంచిర్యాల జిల్లా నస్పూర్ లో..  సింగరేణి స్కూల్ పోలింగ్ కేంద్రం వార్డు 1, పోలింగ్ బూత్ 1 వద్ద మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుండగా… … టీఆర్ఎస్ కు చెందిన మహిళా ఏజెంట్ గులాబీ రంగు చీర కట్టుకుని.. చేతిపై టీఆర్ఎస్ రాసుకుని అక్కడికి వస్తున్న ఓటర్లకు కారుకు ఓటేయమని చూపిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేశారు.. దీంతో ఇరుపార్టీల నాయకులకు మద్య వాగ్వాదం జరిగింది.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

మందు, మనీ లేదంటే బెదిరింపు వార్డు మెంబర్ల కోసం రంగంలోకి దిగిన MLA