బీజేపీ దిమ్మెలపై టీఆర్​ఎస్ జెండా పండుగ

బీజేపీ దిమ్మెలపై టీఆర్​ఎస్ జెండా పండుగ

సత్తుపల్లి, వెలుగు: పలుచోట్ల బీజేపీ జెండా దిమ్మెలపై టీఆర్​ఎస్​ జెండా పండుగను నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని సిద్దారం రోడ్, హనుమాన్​ నగర్​ ప్రాంతాల్లో టీఆర్​ఎస్​ లీడర్లు బీజేపీ జెండా దిమ్మెలకు రాత్రికి రాత్రే తమ పార్టీ రంగులు వేసి గురువారం జెండా పండుగ నిర్వహించారు. దీంతో శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగస్వామి స్థానిక పోలీస్​స్టేషన్​లో ఎస్సై రాములుకు ఫిర్యాదు చేశారు. టీఆర్​ఎస్​ లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్యామ్​ రాథోడ్​, సుదర్శన్ మిశ్రా, రాఘవరావు తదితరులు ఉన్నారు.