టీఆర్ఎస్ది కాంట్రాక్టర్ల ప్రభుత్వం

టీఆర్ఎస్ది కాంట్రాక్టర్ల ప్రభుత్వం

టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ప్రభుత్వమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పథకాలను చేపట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని వ్యవస్థలన్నిటినీ నాశనం చేశారని, రాజ్యాంగం అంటే ఆయనకు చిన్నచూపని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాకా వెంకటస్వామి కృషితో రూపుదిద్దుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తై  ఉంటే ఉమ్మడి జిల్లాకి 55వేల హెక్టార్లకు నీళ్లొచ్చేవని, కానీ కేసీఆర్ తన స్వార్ధం కోసం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీయేనని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారు. 

బాధిత కుటుంబానికి పరామర్శ

ఇటీవల అకాల మరణం చెందిన పౌడెల్ కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.  పౌడెల్ అకాల మరణం పార్టీకి తీరని లోటని, బతికినంత కాలం పార్టీ కోసం పౌడెల్ చాలా కృషి చేశారని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పౌడెల్ చాలా కష్టపడ్డారని కొనియాడారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాని హామీ ఇచ్చారు.

For More News..

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

పోలీసుల అదుపులో రాహుల్ సిప్లిగంజ్