సిబ్బందిని అడ్డం పెట్టుకొని లీడర్ల అక్రమాలు

సిబ్బందిని అడ్డం పెట్టుకొని లీడర్ల అక్రమాలు

జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దామరచర్ల మీదుగా ఏపీకి తరలింపు

నల్గొండ, వెలుగు : సూర్యాపేట జిల్లాలో కల్తీ మద్యం దందా మళ్లీ మొదలైంది. అధికార పార్టీ లీడర్ల అండతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. షాపుల్లో పనిచేసే సిబ్బందిని అడ్డంపెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా కల్తీ మద్యం సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇటీవల కోదాడలోని ఓ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అనంతగిరి మండలం కేంద్రంలోని శ్రీ సాయి వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కల్తీ మద్యం ఆనవాళ్లు బయటపడగా, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని పాలకీడు మండలం జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైదులు వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కల్తీ గుట్టు రట్టు అయింది. 

నీళ్లు కలిపి ఏపీకి రవాణా..

జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైన్స్ నుంచి కల్తీ మద్యాన్ని అక్రమంగా ఏపీకి సప్లై చేస్తున్నారు. షాపులో పని చేసే సిబ్బంది సమీపంలోనే ఓ రూంను రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకున్నారు. తాము పనిచేస్తున్న షాపు నుంచి మద్యం సీసాలను తీసుకొచ్చి వాటిలో నీళ్లు కలిపి జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దామరచర్ల మీదుగా ఏపీలోని బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులకు తరలిస్తున్నారు. ఏపీలో మాన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మద్యం దొరకకపోవడంతో జాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కల్తీ చేసి తరలిస్తున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పట్టుకున్న 104 బాటిళ్లలో నీళ్లు కలిపినట్లు ఎంక్వైరీలో తేలింది. దీంతో అదే షాపులో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది, షాపు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు పెట్టారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షల విలువైన మద్యాన్ని ఏపీకి తరలించినట్లు చెబుతున్నారు. వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకరు అయితే హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన కొందరు వ్యక్తులు భారీ మొత్తంలో గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి షాపును నడుపుతున్నారు. తాము ఇచ్చిన గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాబట్టుకునేందుకు కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఓ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ దందా వెనుక హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన అధికార పార్టీ నేత సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు కేసు పెట్టి హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా ఆఫీసర్లపై కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. సంఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండా కేవలం కేసు మాత్రమే పెట్టి సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారని  సమాచారం.

కోదాడలోనూ...

కోదాడలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు లీటర్ల మద్యం బాటిల్లో నీళ్లు కలిపి సేల్ చేస్తున్నట్లు గుర్తించారు. అనంతగిరి మండల కేంద్రంలోని సాయి వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిగ్నేచర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కల్తీ జరిగిందని అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు షాపులోని వ్యక్తులతో గొడవ పడ్డారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేసింది. కల్తీ చేసిన సిగ్నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇద్దరు సిబ్బందిపై కేసు పెట్టారు. ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏ3గా చేర్చారు. బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్లలో లూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఉండడంతో కల్తీ జరుగుతోంది. కానీ వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విరుద్ధం అయినప్పటికీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిళ్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి లూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అమ్ముతున్నారు. పర్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తాగేందుకు వచ్చే జనాలకు కల్తీ మద్యం అమ్ముతున్నారు. దీని పసిగట్టిన కొందరు వ్యక్తులు సిబ్బందిపై తిరగబడడంతో కల్తీ గుట్టు బయటపడింది. 

పట్టించుకోని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్తీ లిక్కర్‌ నియంత్రణ, ధరలను కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రత్యేకంగా ఉన్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి మూడు నాలుగు రోజులకోసారి వచ్చిపోతుండడంతో కల్తీ సమచారం తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెల్టుషాపులు, వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోలికి పోవద్దని పైఆఫీసర్ల నుంచి ఆదేశాలు ఉండడంతో జిల్లా ఆఫీసర్లు, టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో లేదంటే సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్ అయితేనో తప్ప స్పందించడం లేదని అదే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.