మునుగోడును అభివృద్ధి చేస్తా : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడును అభివృద్ధి చేస్తా  : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉప ఎన్నికలో తనను గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తన గెలుపు కోసం పని చేసిన వారందరికీ, వామపక్ష నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికలో తనను బలపర్చిన టీఆర్ఎస్ నాయకులు అందరికీ రుణపడి ఉంటానన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాణా సంచా కాలుస్తూ వేడుకలు జరుపుకున్నారు.