టీఆర్ఎస్ నాయకులు.. వాహనదారులకు మధ్య గొడవ

టీఆర్ఎస్ నాయకులు.. వాహనదారులకు మధ్య గొడవ

హైదరాబాద్ కూకట్ పల్లిలో బంద్ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులు.. వాహనదారులకు మధ్య గొడవ జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు.. వాహనదారులను అడ్డుకోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఆఫీసులకు వెళ్లే తమను అడ్డుకోవడంపై వాహనదారులు మండిపడ్డారు. 11 గంటల నుంచి బంద్ అని చెప్పి.. ఉదయమే వాహనాలను అడ్డుకుంటే తాము ఆఫీసులకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. తాము కూడా రైతులకు మద్దతుగానే ఉన్నామని.. ఇలా బలవంతంగా అడ్డుకోవడం సరికాదన్నారు.