రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం

రేపు టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళవారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి.. తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల కథనం.