
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వడ్లు కొంటుందా కొనదా అనే విషయంలో స్పషతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసం ఇందిరాపార్క్‌లో గురువారం నవంబర్ 18న మహాధర్నా చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేసి.. అనంతరం గవర్నర్ ను కలిసి మెమొరాండం ఇస్తామని ఆయన చెప్పారు.