
రాష్ట్ర ప్రజలు, రైతాంగం తరఫున ఢిల్లీకి వచ్చిన తెలంగాణ మంత్రులు, ఎంపీలను కేంద్రం అవమానిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలను కేంద్ర పెద్దలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడొద్దన్న మంత్రి.. యాసంగి వరి పంట వేయాలా వద్దా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు స్పందించని పక్షంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ వ్యూహమేంటో చూస్తారని అన్నారు. రైతుల కోసం కేంద్రం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్న మోడీ ఆ మాట మరిచిపోయారని మండిపడ్డారు.
మరిన్ని వార్తల కోసం..
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆన్లైన్ పెళ్లికి హైకోర్టు అనుమతి