
- ఖమ్మం జిల్లాకే తరలుతున్న ఫండ్స్
- ఏటా జిల్లాకు కోట్ల రూపాయల నష్టం
- జిల్లాలోని స్థానిక సంస్థలకు నిధుల కొరత
- జడ్పీ మీటింగ్ లో తీర్మానించినా అమలు చేస్తలేరు
- సీఎం స్పందించాలని స్థానికుల డిమాండ్
మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నా..రాయల్టీ రూపంలో జిల్లాకు కోట్లలో అందవలసిన ఫండ్స్రావడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో రోడ్లు దెబ్బతిని, మౌలికవసతుల లేక అభివృద్ధి కుంటుపడుతోంది.
నిరంతరాయంగా తవ్వకాలు..
జిల్లాలో ఇప్పటికే 168 గ్రానైట్క్వారీలకు పర్మిషన్ఉండగా.. వాటిలో 39 చోట్ల నిరంతరాయంగా గ్రానైట్తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి గ్రానైట్షీట్లను పాలిషింగ్కోసం ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. రోజూ వేలాది క్యూబిక్‌మీటర్ల గ్రానైట్ తరలిపోతున్నా.. జిల్లాకు రావలసిన సీనరేజ్, డిస్ట్రిక్ట్ మినరల్ఫౌండేషన్ట్రస్టు (డీఎంఎఫ్టీ) ఫండ్స్జిల్లాకు దక్కడం లేదు. జిల్లాకు రావాల్సిన నిధులు మొత్తం ఖమ్మం జిల్లా మైనింగ్విభాగానికి వెళ్తున్నాయి. దీంతో మహబూబాబాద్జిల్లాకు ఏటా కోట్లలో నష్టం జరుగుతోంది.
స్థానిక సంస్థలకు నిధుల కొరత..
2019–20 సంవత్సరంలో 83,217 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ కు సంబంధించి 2,420 అనుమతులను మంజూరు చేశారు. వీటికి సీనరేజీ ఫీజులు రూ.5.75 కోట్లు, డీఎంఎఫ్టీ ట్యాక్స్‌రూ. 1.15 కోట్ల ల్లో రాగా, 2020–21లో1, 663.95 లక్షలు, 2021–22 రూ.1743.18 లక్షలు, 2022–23కు గాను ఇప్పటి వరకు రూ.821.19 లక్షల మైనింగ్ ట్యాక్స్వసూలు చేశారు. మొత్తం నిధులన్నీ ఖమ్మం మైనింగ్విభాగంలోనే జమ అవుతున్నాయి. ఫలితంగా మహబూబాబాద్జిల్లాలో స్థానిక సంస్థల ద్వారా అభివృద్ధి పనులకు కూడా నిధుల కొరత ఏర్పడుతోంది.
ఖమ్మం జిల్లా నుంచే ట్రాన్సిట్ఫారాలు
మానుకోట జిల్లాలో గ్రానైట్ తవ్వకాలు జోరుగా సాగుతున్నా.. పర్మిషన్ పేపర్లు, ట్రాన్సిట్ఫారాలు ఖమ్మం జిల్లా నుంచే జారీ చేస్తున్నారు. దీంతో జిల్లాకు సీనరేజ్, డీఎంఎఫ్టీ ఫండ్స్దక్కడం లేదు. ఖమ్మం జిల్లా నేతలు గతంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సీఎంవో ద్వారా ఒక జీవోను తీసుకువచ్చి గ్రానైట్అనుబంధ పరిశ్రమలు ఖమ్మంలో ఉన్నందున సీనరేజీ ఫండ్స్ఆ జిల్లాకే దక్కేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనివల్ల ఉమ్మడి వరంగల్జిల్లాలో మహబూబాబాద్జిల్లాకే ఎక్కువగా నష్టం జరుగుతోంది.
జడ్పీలో తీర్మానం చేసినా..
మానుకోట జిల్లా జడ్పీ మీటింగ్‌లో గ్రానైట్,సీనరేజీ, డీఎంఎఫ్టీ ట్యాక్స్ జిల్లాకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏడాది కింద ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అప్పటి కలెక్టర్వీపీ. గౌతమ్.. రాష్ట్ర మైనింగ్ఆఫీసర్లకు లెటర్ కూడా రాశారు. అయినా ఫలితం లేదు. ఖమ్మం జిల్లా లీడర్లు వారికున్న బలమైన లాబీతో గతంలో ఉన్న జీవోనే అమలు చేయించుకుంటున్నారు. అయితే ఈ సమస్య సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే పరిష్కారం అవుతుందని స్థానిక లీడర్లు చెప్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మైనింగ్ ఆఫీసర్లు చొరవ చూపాలి
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవో ప్రకారం ఖమ్మం జిల్లాలో గ్రానైట్ఆధారిత పరిశ్రమలు ఉన్నాయనే కారణంతో మానుకోట జిల్లాకు చెందవలసిన సీనరేజీ, డీఎంఎఫ్టీ ఫండ్స్‌ను కూడా అక్కడే మళ్లించడం తగదు. మానుకోట జిల్లాలో విస్తారంగా ఖనిజ నిక్షేపాలు ఉన్నా, ఇక్కడి ప్రజలకు ఫలితం లేకుండా పోతోంది. జిల్లాలో స్థానిక సంస్థల ద్వారా మరింత అభివృద్ధి పనులు చేపట్టే వీలు కలుగడం లేదు. రాష్ట్ర మైనింగ్ ఆఫీసర్లు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలి. ఇంకా కాలయాపన చేస్తే జిల్లా మంత్రులతో కలసి త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలసి మహబూబాబాద్ జిల్లాకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తాం.
– బానోతు శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే