
పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు. ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలన్నారు. తెలంగాణ నుంచి మొత్తం కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించాలన్నారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో పంట సాగు అయ్యిందన్నారు. లక్షల ఎకరాల్లో ధాన్యం ఎలా పండిస్తారని కేంద్రం ప్రశ్నిస్తుందన్నారు. ఎంఓయు ప్రకారం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతుందన్నారు. పంజాబ్ లో ఒకలా తెలంగాణా పట్ల మరోలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామానాగేశ్వర్ రావు. పార్లమెంట్ లో పంట కొనుగోళ్లపై వాయిదా తీర్మానాలు ఇచ్చామన్నారు. లోక్ సభ స్పీకర్ తిరస్కరించారన్నారు. పంటల కొనుగోళ్లపై పార్లమెంట్ లో చర్చకు నిరాకరించడంతో ఆందోళన చేశామన్నారు. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలన్నారు.