టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త దౌర్జన్యం

 టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త దౌర్జన్యం

మేడ్చల్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త దౌర్జన్యంగా ప్రవర్తించారు. పక్కింట్లో పేల్చిన పటాకులు తమ ఇంటి వైపు వచ్చాయని కౌన్సిలర్ భర్త దాడి చేశారు. ఇక వివరాల్లోకి వెళితే.. దీపావళి పండుగ రోజున తన ఇంటి ప్రక్కనే  ఉన్న మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుండి క్రాకర్స్ తన ఇంటి వైపు వచ్చాయని 22 వ వార్డు కౌన్సిలర్ మాధవి భర్త నరేందర్ అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో అనుచరులతో మోహన్ రెడ్డి ఇంటిలోకి చొరబడి మహిళలపైనా దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ మేరకు బాధితురాలు వినోద మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన మేడ్చల్ పోలీసులు..  కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

మేడ్చల్ లో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారని పలువురు వాపోతున్నారు. మంత్రి మల్లారెడ్డి అండ తో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇళ్ళల్లోకి చొరబడి మహిళలని కూడా చూడకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.