వడ్లు కేంద్రమే కొనాలె.. టీఆర్‌‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలు

వడ్లు కేంద్రమే కొనాలె.. టీఆర్‌‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలు

రాష్ట్రంలో రైతులు పండించి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంతటా అధికార టీఆర్‌‌ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టింది. నియోజకవరాల్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. జిల్లా కేంద్రాల్లో మంత్రులు నిరసనలో పాల్గొంటున్నారు. సిరిసిల్ల బైపాస్‌లో మంత్రి కేటీఆర్, సిద్ధిపేటలో హరీశ్ రావు ధర్నా చేశారు. ఇందిరా పార్క్ దగ్గర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఒక్కో దగ్గర ధర్నాలో 3 వేల మంది పాల్గొనేలా ప్లాన్ చేశారు టీఆర్‌‌ఎస్ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులు  ధర్నాలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించింది. యాసంగిలో పండే ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. యాసంగిలో కేంద్రం ధాన్యం కొంటుందా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ హైవేపై జరిగిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఆర్డీవో ఆఫీస్ ను ముందు టీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బస్వరాజు సారయ్య, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మానకొండూర్ లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధర్నా చేశారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి ఎండ్ల బండ్లతో ర్యాలీ చేసి తమ నిరసన తెలిపారు.