రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్

రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్

హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా.. వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ వేశారు. అసెంబ్లీలో అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రవిచంద్ర నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ హాజరయ్యారు.  నామినేషన్ కు ముందు రవిచంద్రను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పదవీ కాలం ముగియడంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. ఇక బండా ప్రకాశ్ రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు  సీట్లు కూడా టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ బుధవారం దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, హెటిరో పార్థసారధి రెడ్డిని ఎంపిక రాజ్య సభ సీట్లకు ఎంపిక చేశారు. 

ఇక వద్దిరాజు రవిచంద్ర నేపథ్యం...

వ‌ద్దిరాజు ర‌విచంద్ర 1964, మార్చి 22న మ‌హ‌బూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం ఇనుగుర్తి గ్రామంలో జ‌న్మించారు. ఈయ‌న‌కు భార్య విజ‌య‌ల‌క్ష్మి, కూతురు గంగా భ‌వాని, కుమారుడు సాయి నిఖిల్ చంద్ర ఉన్నారు. గాయత్రి రవిగా ఫేమస్ అయిన వద్దిరాజు రవిచంద్ర ఖమ్మంకు చెందిన గ్రానైట్ వ్యాపారి. ఈయన 2018లో వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులుగా కొన‌సాగుతున్నారు.

మరిన్ని వార్తల కోసం...

గుడ్ న్యూస్: తగ్గనున్న వంటనూనెల ధరలు 

స్థానిక సంస్థలకు మరిన్ని నిధులు ఇవ్వాలె