కరోనా రూల్స్ పాటించని ట్రంప్..కారులో చక్కర్లు

కరోనా రూల్స్ పాటించని ట్రంప్..కారులో చక్కర్లు

కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ … ప్రస్తుతం వాల్ట‌ర్ రీడ్ నేష‌న‌ల్ మిలిట‌రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  అయితే ఆయన కరోనా రూల్స్ బ్రేక్ చేసి… త‌న అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. ఆస్పత్రి బ‌య‌ట వేచి చూస్తున్న త‌న మ‌ద్ద‌తుదారుల‌ను ప‌ల‌క‌రించేందుకు ఓ యూఎస్‌యూవీ కారులో బ‌య‌ట‌కు వెళ్లారు. మాస్క్ ధ‌రించిన ట్రంప్ త‌న అభిమానుల్ని కారులో చక్కర్లు కొడుతూ సైగలతో ప‌లుక‌రించారు. అయితే కరోనా ల‌క్ష‌ణాల‌తో ట్రంప్ కారులో బ‌య‌ట‌కు వెళ్ల‌డం ప‌ట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అలా చేయ‌డంతో  ఆయ‌న సిబ్బందికి ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. వ్యాధి ఎంతటి తీవ్రమైనదో తెలిసి కూడా… ట్రంప్ మాత్రం ఫోటో షూట్ స్ట‌యిల్‌లో ఆస్పత్రి  బ‌య‌ట తిర‌గ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.