నార్త్ కొరియాతో చర్చలకు రెడీ : ట్రంప్

నార్త్ కొరియాతో చర్చలకు రెడీ : ట్రంప్

నార్త్ కొరియాతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమే అన్నట్లు సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఐర్లండ్ పర్యటనలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. అమెరికా, నార్త్ కొరియా రెండువైపులా డీల్ కుదుర్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నామన్నారు. మొదటి విడత చర్చలు కాస్త విజయవంతంగానే జరిగినా… రెండో విడత వియత్నాంలో జరిగిన చర్చలు మాత్రం అసంపూర్తిగా ముగిశాయి. చర్చల తర్వాత ఎలాంటి జాయింట్ స్టేట్ మెంట్ వెలువడలేదు. అయితే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, కిమ్ తో మూడో భేటీకి సిద్ధమన్నట్లుగా ట్రంప్ సంకేతాలిచ్చారు. నార్త్ కొరియాపై ఆంక్షలు తొలగించాలంటే కొన్ని పట్టువిడుపులు ఉండాలని అమెరికా ఇప్పటికే సూచించింది.