గాజా యుద్ధం ముగిసింది.. సుంకాలతో ఇండియా, పాక్ యుద్ధం ఆగింది : ట్రంప్

గాజా యుద్ధం ముగిసింది.. సుంకాలతో ఇండియా, పాక్ యుద్ధం ఆగింది : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ద్వారా  చాల వివాదాలను పరిష్కరించానని మరోసారి చెప్పారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను ఉదాహరణగా చూపిస్తూ, ఈ రెండు దేశాలను భారీ సుంకాలతో హెచ్చరించానని, దాంతో 24 గంటల్లోనే సమస్య పరిష్కారమైందని అన్నారు. సుంకాలు లేకపోతే ఈ విజయం సాధించేవాడిని కాదని ఇజ్రాయెల్‌కు వెళ్లే సమయంలో విలేకరులతో అన్నారు.

 గాజా శాంతి, ఇజ్రాయెల్ పర్యటన గురించి మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టడమే నా లక్ష్యం అని అన్నారు. మిడిల్ ఈస్ట్ పరిస్థితిపై మాట్లాడటానికి ఇజ్రాయెల్ తర్వాత ఈజిప్టును సందర్శిస్తానని, అక్కడ చాల ప్రాంతీయ నాయకులను కలుస్తానని కూడా ఆయన ప్రకటించారు.

ALSO READ : ట్రేడ్ వార్‎కు భయపడం.. ట్రంప్‏కు చైనా వార్నింగ్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం : ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ముగిసిందని, కాల్పుల విరమణ ఒప్పందం నిలబడుతుందని తాను నమ్ముతున్నానని అన్నారు.

ఇజ్రాయెల్ పార్లమెంటులో ట్రంప్ ప్రసంగం: గాజా శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత ట్రంప్ ఇజ్రాయెల్‌ సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఆయన బందీల కుటుంబాలను కలుస్తారు అలాగే ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెస్సెట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇజ్రాయెల్‌లో తన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత, ట్రంప్ ఈజిప్టుకు వెళతారు. హమాస్ అలాగే ఇజ్రాయెల్ మధ్య చర్చలకు ఈజిప్టు వేదికగా నిలిచింది.