ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ ఫైర్…

ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ ఫైర్…

ప్రపంచ ఆరోగ్య సంస్థకు (WHO) నిధులు ఆపేస్తున్నట్లు ప్రకటించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.  కరోనా వైరస్ విషయంలో కమ్యునిస్ట్ చైనాకు WHO అనుకూలంగా వ్యవహరించిందని అందుకే పలు దేశాలు కరోనా బారిన పడినట్లు ఆరోపించారు.  వైరస్ మొదటి దశలో ఉన్నప్పుడు WHO దగ్గర సమాచారం ఉన్నా తమతో పంచుకోలేదని ఆయన అన్నారు. చైనాలో కరోనా వైరస్ అంతకంతకు పెరుగున్న సమయంలో చైనా నుంచి  అమెరికాకు ప్రయాణాలు నిషేదిస్తామన్నప్పుడు WHO అడ్డుచెప్పిందని చెప్పారు. ఆ తప్పుడు నిర్ణయంవల్లే అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు.

కరోనా వ్యాప్తికి కారణమైన చైనా ప్రపంచ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని అన్నారు ట్రంప్. ఇందుకు WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ కూడా కారణమని తెలిపారు. WHOపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు. అమెరికా నిధులను వేల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన నిర్లక్షపు సంస్థకు కట్టలేమని అన్నారు ఆదేశ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్ జిమ్ రిష్. టెడ్రోస్ అధనోమ్ WHO చీఫ్‌గా రాజీనామా చేసే వరకు నిధులు నిలిపివేయనున్నట్లు చెప్పారు.

కరోనా యొక్క ముప్పును ప్రపంచం నుంచి దాచడానికి చైనా కమ్యునిస్ట్ పార్టీకి WHO సహాయపడిందని అన్నారు. ఇప్పడు 10వేల మంది అమెరికన్లు చనిపోయారని, రొబోయే వారాల్లో ఇది గణనీయంగా పెరగనుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ సభ్యుడు గై రెస్చెంతలర్.