షరతులు వర్తిస్తాయ్ : అమెరికాలో టిక్ టాక్ నిషేదంపై వెనక్కి తగ్గిన ట్రంప్

షరతులు వర్తిస్తాయ్ : అమెరికాలో టిక్ టాక్ నిషేదంపై వెనక్కి తగ్గిన ట్రంప్

అమెరికాలో టిక్ టాక్ నిషేదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఆగస్ట్ లో చైనాకు చెందిన యాప్ టిక్ టాక్ ను నిషేదిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన ఆయన..అమెరికాలో టిక్ టాక్ ను కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేశారు.

అయితే టిక్ టాక్ నిర్వహాణ చైనా నుంచి కాకుండా అమెరికా నుంచే జరగాలనే షరతు విధించారు. ఆ షరతులపై ఒప్పుకున్న టిక్ టాక్ అమెరికాకు చెందిన ఒరాకిల్, వాల్ మార్ట్ భాగస్వామ్యంలో టిక్ టాక్ గ్లోబల్ అనే సంస్థను స్థాపించనుంది.

ఈ సందర్భంగా వైట్ హౌజ్ వద్ద యూఎస్ ట్రెజరర్ మాట్లాడుతూ దేశ భద్రత, దేశానికి చెందిన సంబంధిత డేటాను రక్షించేందుంకు ఒరాకిల్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇక లావాదేవీలను ఒరాకిల్, వాల్ మార్ట్ షరతులకు లోబడి టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ చేయాల్సి ఉందన్నారు.