తెలంగాణ సంస్కృతి రక్షణకు కృషి : ఎమ్మెల్సీ విజయశాంతి

తెలంగాణ సంస్కృతి రక్షణకు కృషి : ఎమ్మెల్సీ విజయశాంతి

కూకట్ పల్లి, వెలుగు: తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని కాంగ్రెస్​ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం ఆమె కాంగ్రెస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి రమేశ్​తో కలిసి మూసాపేటలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వివిధ ఆలయాల వద్ద సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఆలయ కమిటీల నిర్వాహకులతో కలిసి అందజేశారు.