డ్రగ్స్ నెట్​వర్క్​ను..డోపమ్ పట్టిస్తది

డ్రగ్స్ నెట్​వర్క్​ను..డోపమ్ పట్టిస్తది
  •     టీఎస్ కాప్‌‌‌‌‌‌‌‌, సీసీటీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో యాప్​ యాక్టివ్‌‌‌‌‌‌‌‌
  •     దేశంలోని డ్రగ్స్, గంజాయి నేరస్తుల డేటా
  •     పెడ్లర్లు,  నేరస్తుల ప్రొఫైలింగ్‌‌‌‌‌‌‌‌తో పోలీసుల సెర్చ్‌‌‌‌‌‌‌‌
  •     అఫెండర్ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌తో ట్రేస్ చేస్తున్న టీన్యాబ్‌‌‌‌‌‌‌‌ 
  •     ఈ ఏడాది దాదాపు 425 మంది అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ను అరికట్టేందుకు టీఎస్‌‌‌‌‌‌‌‌ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో(టీన్యాబ్‌‌‌‌‌‌‌‌) స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది. నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ బ్యూరో (ఎన్‌‌‌‌‌‌‌‌సీబీ), డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ఆఫ్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి జాయింట్‌‌‌‌‌‌‌‌ఆపరేషన్ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్ స్మగ్లర్స్, ఏపీ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల్లోని గంజాయి సప్లయర్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ సభ్యులను అరెస్ట్ చేస్తున్నది. రాష్ట్రంలో రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌  కేసుల డేటా,‘ డ్రగ్ అఫెండర్స్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైలింగ్‌‌‌‌‌‌‌‌ అనాలిసిస్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌’ (డోపమ్స్‌‌‌‌‌‌‌‌)యాప్‌‌‌‌‌‌‌‌తో నిఘా కంటిన్యూ చేస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీస్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డ్రగ్ పెడ్లర్ల యాక్టివిటీని గుర్తించి అరెస్ట్‌‌‌‌‌‌‌‌లు చేస్తోంది.  గత 8 నెలల వ్యవధిలో రాష్ట్ర పోలీసులు దాదాపు 450 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

యాప్​లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి నిందితుల డేటా  

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి స్మగ్లర్లను ట్రాక్  చేసేందుకు రాష్ట్ర  కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‘ డ్రగ్ అఫెండర్స్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైలింగ్‌‌‌‌‌‌‌‌ అనాలిసిస్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌’(డోపమ్స్‌‌‌‌‌‌‌‌) సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. దీన్ని 2021 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. టీఎస్‌‌‌‌‌‌‌‌ కాప్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌,  క్రైమ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ నెట్​వర్క్​ సిస్టమ్‌‌‌‌‌‌‌‌(సీసీటీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌)తో యాప్​ను కనెక్ట్‌‌‌‌‌‌‌‌  చేశారు. దీని ద్వారా నార్కొటిక్  డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌) కేసుల ప్రొఫైలింగ్ మానిటరింగ్, విశ్లేషణ చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో నిందితుల ప్రొఫైల్‌‌‌‌‌‌‌‌, ఫొటోలు, సరఫరా చేసిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, కస్టమర్లు, హాట్‌‌‌‌‌‌‌‌స్పాట్స్‌‌‌‌‌‌‌‌ వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో పెట్టారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీస్‌‌‌‌‌‌‌‌, రాష్ట్రంలో నమోదవుతున్న ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌  కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  

హైదరాబాద్ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వింగ్‌‌‌‌‌‌‌‌(హెచ్‌‌‌‌‌‌‌‌న్యూ) ఏర్పడిన తరువాత డోపమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి సేకరించిన సమాచారంతో డ్రగ్స్, గంజాయి పెడ్లర్లను పట్టుకున్నారు. టీఎస్‌‌‌‌‌‌‌‌యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్‌‌‌‌‌‌‌‌) ఏర్పడిన తర్వాత 3 నెలల కాలంలో దాదాపు 425 మంది డ్రగ్ అఫెండర్లను అరెస్ట్ చేశారు. గతంలో  మాదకద్రవ్యాలు సప్లయ్ చేస్తూ అరెస్టయిన వారి పెడ్లర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, కస్టమర్ల డేటా ఆధారంగా స్పెషల్ ఆపరేషన్స్ చేశారు. ఈ క్రమంలో  ఇతర రాష్ట్రాల పోలీసులకు అఫెండర్ల సమాచారం చేరవేస్తున్నారు.

ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌, సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌సీబీ, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐల డేటా బేస్‌‌‌‌‌‌‌‌తో..

ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌‌‌‌‌‌‌‌సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) గత ఐదేండ్లుగా రాష్ట్రంలో పట్టుబడ్డ డ్రగ్స్, గంజాయి సహా ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కేసులు, కస్టమర్ల వివరా
లను డోపమ్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పట్టుబడ్డ నేరస్తుల ఫొటోలు, డ్రగ్స్ సప్లయ్ చేసిన విధానం, కస్టమర్ల వివరాలతో పూర్తి సమాచారం ఫీడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఓల్డ్‌‌‌‌‌‌‌‌అఫెండర్లు, హాట్‌‌‌‌‌‌‌‌స్పాట్స్ ట్రేస్ చేసే విధానం గురించి ఉన్నతాధికారుల గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చారు. డీజీ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల యూనిట్లు,746 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి యాప్‌‌‌‌‌‌‌‌ యాక్సెస్‌‌‌‌‌‌‌‌లో  పెట్టారు. దీంతో ప్రతి పీఎస్‌‌‌‌‌‌‌‌లో రిజిస్టరయ్యే డ్రగ్స్, గంజాయి, ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదైన కేసులు, నిందితుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

‘గుంటూరుకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ నైజీరియన్లతో కలిసి సిటీలో డ్రగ్స్, గంజాయి సేల్‌‌‌‌‌‌‌‌ చేస్తుండేవాడు. గతేడాది పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.‘ డ్రగ్ అఫెండర్స్‌‌‌‌‌‌‌‌ ప్రొఫైలింగ్‌‌‌‌‌‌‌‌ అనాలిసిస్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌’(డోపమ్స్) యాప్‌‌‌‌‌‌‌‌లో అతడి డీటెయిల్స్ ను అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేశారు. బాలాజీ  జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్లీ డ్రగ్స్ సప్లయ్ మొదలుపెట్టాడు. సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డికి కొకైన్ సప్లయ్ చేస్తూ  గత నెల 30న టీన్యాబ్ పోలీసులకు చిక్కాడు. డోపమ్ యాప్​ సాయంతో బాలాజీపై నిఘా పెట్టిన  టీ న్యాబ్ పోలీసులు మరోసారి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

‘కామారెడ్డి జిల్లాకు చెందిన వీరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజీ మనీకోసం డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నరేశ్​చౌదరితో కలిసి గతేడాది సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. వీరిద్దరి పేర్లతో పాటు ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు, డ్రగ్ పెడ్లర్ల వివరాలను డోపమ్స్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో  పోలీసులు అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేశారు.  వీరేందర్, నరేశ్ జైలు నుంచి బయటికి వచ్చా మళ్లీ డ్రగ్స్ దందా షురూ చేశారు. డోపమ్ యాప్ సాయంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు గతవారం వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న రాజస్థాన్​కు చెందిన హోంగార్డు ప్రదీప్ శర్మను సైతం అరెస్ట్ చేశారు.