నైట్ కర్ఫ్యూనా ?.లాక్ డౌన్ ఎత్తివేతనా?

నైట్ కర్ఫ్యూనా ?.లాక్ డౌన్ ఎత్తివేతనా?

కాసేపట్లో  రాష్ట్ర  కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్  అధ్యక్షతన క్యాంప్ ఆఫీస్ లో  జరిగే ఈ భేటీలో.. ముఖ్యంగా  అన్ లాక్ పై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం  అమలౌతున్న లాక్ డౌన్  సడలింపుల  టైం ... ఇవాళ్టితో ముగియనుంది.  రాష్ట్రంలో మే 12  నుంచి లాక్ డౌన్  అమలు చేస్తోంది ప్రభుత్వం. కరోనా ప్రభావం  తీవ్రంగా ఉండటంతో.. మొదట  ఉదయం ఆరింటి  నుంచి 10 గంటల వరకే  మినహాయింపులిచ్చింది.  తర్వాత మధ్యాహ్నం   ఒంటిగంట వరకు, ఆ తర్వాత సాయంత్రం  ఐదింటి వరకు  సడలింపులు పెంచుతూ పోయింది. ప్రస్తుతం కేసులు తగ్గుతుండటంతో.. మరిన్ని సడలింపులు  ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. 

లాక్ డౌన్ ను  రాత్రి 10 నుంచి  ఉదయం ఆరింటి వరకు  నైట్ కర్ఫ్యూ అమలు చేసే ఆలోచనలో  సర్కార్ ఉన్నట్లు  తెలుస్తోంది. లాక్ డౌన్  పూర్తిగా ఎత్తివేయాలనే ప్రతిపాదన  ప్రభుత్వం ముందు  ఉన్నప్పటికీ.. ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేస్తే విమర్శలు  వచ్చే అవకాశం  ఉందని సర్కారు  భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పదిరోజులు  నైట్ కర్ఫ్యూ పొడిగించి ... ఆ  తర్వాత ఎత్తేసే  ఆలోచనతో  సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ భేటీలో అన్ లాక్ తో పాటు... ఇరిగేషన్ ప్రాజెక్టులు, గోదావరి ఎత్తపోతలు, వానాకాలం పంట సీజన్ పై  సీఎం కేసీఆర్  చర్చించే అవకాశం ఉంది. మరోవైపు వానాకాలం సీజన్  మొదలైనా... కొన్ని చోట్ల  కొనుగోలు కేంద్రాల్లోనే  ధాన్యం అలాగే ఉంది. వీటిని  త్వరగా పూర్తి  చేయటంపై  కూడా నిర్ణంయ తీసుకునే అవకాశం ఉంది. అటు నకిలీ  విత్తనాలపై  కూడా కేబినెట్ లో  చర్చించనున్నారు సీఎం కేసీఆర్.