కానిస్టేబుల్ అభ్యర్థులు ఫేక్ బోనఫైడ్స్ అధికారుల రివెరిఫికేషన్

కానిస్టేబుల్ అభ్యర్థులు ఫేక్ బోనఫైడ్స్ అధికారుల రివెరిఫికేషన్

తెలంగాణాలో పోలీసు కొలువు దక్కించుకున్న 13,444 మంది అభ్యర్థుల్లో ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ తీసుకుంటున్నారు. వీరి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అయింది. ఈ నోటిఫికేషన్ లో కొందరు ఫేక్ బోనఫైడ్స్ సమర్పించినట్లు తెలుస్తోంది.  350మంది స్టడీ కండక్ట్స్ సంబంధించిన వివరాలు తప్పుగా ఉన్నాయని అధికారులు అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. వాటిని పునఃపరిశీలించగా.. 250మంది డేటా నిజమేనని తేలింది. దీంతో మిగతా 100 మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేయిస్తున్నారు. వారు చదివిన పాఠశాలల రిజిస్టర్లతో సహా తనిఖీ చేయనున్నారు.

రిజర్వేషన్ ప్రకారం జనాభా ప్రాతిపాదికన పోస్టులను కేటాయిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 7వ తరగతి మధ్యలో నాలుగు తరగతులు ఏ జిల్లాలో చదివితే అదే జిల్లా స్థానికుడిగా పరిగణిస్తారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోస్టులు ఎక్కువగా ఉంటాయి. పోటీ తక్కువగా ఉంటుందని చాలామంది అభిప్రాయం.. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతకు పాఠశాలలు ఇచ్చే బోనఫైడ్‌లనే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. 

ALSO READ :- చంచల్గూడ జైలును తరలిస్తాం.. విద్యాసంస్థగా మారుస్తాం: సీఎం రేవంత్రెడ్డి

కొందరు అభ్యర్థులు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లు చూపించారు. అందులో ఒకటి హైదరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. అవి కూడా కొన్ని తరగతులే కావడంతో వారిపై అనుమానాలు గట్టిగా ఉన్నాయి. మెడికల్ టెస్టులు, ఇతర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు రావడం, పెట్టీ కేసులు, నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు స్పెషల్ బ్రాంచి విచారణలో తేలడం వంటి కారణాలతో మరికొందరు శిక్షణకు అర్హత సాధించలేకపోయినట్లు అధికారులు అంటున్నారు.  నోటిఫికేషన్ లో ఉన్న ఖాళీలు 14వేల 881 కాగా.. 13,953 మందినే శిక్షణకు ఎంపిక చేశారు. దీంతో 928 పోస్టులు బ్యాక్‌లాగ్ ఉండగా.. మరికొన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి.