ఫిబ్రవరి 26 నుంచి ఎప్ సెట్ అప్లికేషన్లు

ఫిబ్రవరి 26 నుంచి ఎప్ సెట్ అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్​ ఎప్​సెట్ (ఎంసెట్) అప్లికేషన్లు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం హైదరాబాద్​లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​లో ఎప్​సెట్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కన్వీనర్ దీన్ కుమార్ తో కలిసి కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఎప్​ సెట్ షెడ్యూల్​ ను రిలీజ్ చేశారు. ఈ నెల 21న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.

26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎప్ సెట్ పరీక్షకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సబ్జెక్టుల్లోని వందశాతం సిలబస్ ఉంటుందని చెప్పారు. మే 9 నుంచి 12 వరకు ఎప్ సెట్ పరీక్షలుంటాయని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఎప్ సెట్ పూర్తిస్థాయి కమిటీని ఈ సందర్భంగా నియమించారు. ఎప్ సెట్ కో కన్వీనర్​గా ప్రొఫెసర్ విజయకుమార్ రెడ్డి, కో ఆర్డినేటర్లుగా ప్రొఫెసర్ తారా కల్యాణి, డి.దర్గకుమార్ నియమితులయ్యారు. 

మార్చి16 నుంచి పీజీఈసెట్ అప్లికేషన్లు..

వచ్చేనెల16 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అధికారులు ప్రకటించారు. మంగళవారం కౌన్సిల్​లో పీజీఈసెట్ కమిటీ సమావేశం జరిగింది. పీజీఈసెట్ షెడ్యూల్​ను కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి తదితరులు రిలీజ్ చేశారు. మార్చి16 నుంచి మే 10 వరకు ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చని వారు సూచించారు. 

ALSO READ:  వీవీపీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్సులకు జోనల్ అలకేషన్ ఉత్తర్వులు