హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల సిఫార్సులతో సంబంధం లేకుండా అర్హత మేరకు దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తున్నది. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు తయారు చేసిన లిస్టే ఫైనల్ అని శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్ల జాబితాను ఇన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రులు ఆమోదిస్తారని, అదే కాపీ జిల్లా కలెక్టర్లకువెళ్తుందని, దాంట్లో ఉన్న పేర్లకు దళిత బంధు స్కీం కింద యూనిట్లను అధికారులు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈ ఏడాదికి సంబంధించి దళిత బంధును మూడు, నాలుగు రోజుల్లో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 

ఈసారి నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దళిత బంధు స్కీంకు ప్రభుత్వం రూ.17,700 కోట్లను కేటాయించింది. ఈ మొత్తాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగిలిన అన్నింటిలో 1.77 లక్షల మంది అర్హులకు జమ చేయాల్సి ఉన్నది. అయితే తొలుత నియోజకవర్గానికి 500 మందికి మాత్రమే ఇస్తామని గత కేబినెట్ భేటీలో సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం 59 వేల మంది దళితులకు రూ.5,900 కోట్లు జమ చేయాల్సి ఉన్నది. దీనికి సంబంధించిన నిధుల విడుదలపై ఆర్థిక శాఖ చర్యలు 
ప్రారంభించింది.

పాత పద్ధతిలోనే ముందుకు..

ఇటీవల దళితబంధు స్కీంలో ఎమ్మెల్యేల సిఫార్సులపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సిఫార్సులకు, లబ్ధిదారుల ఎంపికకు ఎలాంటి  సంబంధం లేదని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలని చెప్పి దళితబంధు అప్లికేషన్లను వరంగల్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో ప్రభుత్వం దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత నుంచి ఎమ్మెల్యేలను తప్పిస్తుందని భావించారు.

అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు మారుస్తుందని అధికారులు అనుకున్నారు. అయితే పాత పద్ధతిలో ఎమ్మెల్యేల నుంచి వచ్చిన పేర్లనే దళితబంధు లిస్ట్​లో పెట్టాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు స్పష్టంగా ఏం చెప్పలేదంటూ పాత పద్ధతిలోనే ముందుకు పోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గత ఏడాది మొత్తం 38,496 మంది లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలే చేశారు.