
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన యువ మౌంటెనీర్ అంగోత్ తుకారాంకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూ.35 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన తుకారాం.. ఎవరెస్ట్ సహా ఐదు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను ఎక్కాడు. చిన్న వయసులోనే ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను ఎక్కి పేరు తెచ్చుకున్న తుకారాం ఓ మీడియా సంస్థ ఎక్సలెన్స్ అవార్డు నెగ్గాడు. దీంతో జగన్ తుకారాంను పిలిపించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించి, దేశానికి మంచి పేరు తెవాలని, దానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.