ఇయ్యాల్టి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

ఇయ్యాల్టి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు : టీఎస్  ఎంసెట్ అడ్మిషన్  కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నది.  ఫస్ట్  ఫేజ్​  కౌన్సెలింగ్ లో భాగంగా ఈ నెల 21  నుంచి 29  వరకూ ఆన్​లైన్​లో రిజిస్ర్టేషన్​ ప్రక్రియ ఉంటుందని టెక్నికల్ ఎడ్యుకేషన్​ కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూల్​ను https://tseamcet.nic.in  వెబ్ సైట్​లో పెట్టామని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ కోసం స్లాట్ బుక్  చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

 ‘‘స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 30 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తారు.  సెప్టెంబర్ 6న ఫస్ట్ ఫేజ్  సీట్లను అలాట్ చేయనున్నారు. వచ్చే నెల 6  నుంచి 13 వరకూ ఆన్​లైన్ లో  రిపోర్టు చేయాల్సి ఉంటుంది” అని అధికారులు తెలిపారు.