
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి జరగనున్నాయి. శనివారం ఈ మేరకు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ విడుదల చేశారు. సైన్స్ మినహా అన్ని ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు. 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఫస్ట్ లాంగ్వేజీ (గ్రూప్–ఏ), ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజీ పార్ట్–1(కంపోజిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజీ పార్ట్-2 (కంపోజిట్ కోర్స్) పరీక్షలు నిర్వహిస్తారు.
19న సెకండ్ లాంగ్వేజీ, 21న థర్డ్ లాంగ్వేజీ (ఇంగ్లిష్), 23న మ్యాథమెటిక్స్, 26న ఉదయం 9.30 నుంచి 11 గంటలకు వరకు సైన్స్పార్ట్–1 (ఫిజికల్ సైన్స్), 28న ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పార్ట్–2 (బయోలాజికల్ సైన్స్), 30న ఉదయం 9.30 నుంచి 12.30 వరకు సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ఒకటిన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్–1 (సంస్కృతం, అరబిక్) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, అదే రోజు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ), ఏప్రిల్2న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓఎస్ఎస్సీ మెయిన్లాంగ్వేజీ పేపర్–2 (సంస్కృతం, అరబిక్) నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ టైప్(పార్ట్–బీ) సమాధానం ఇచ్చే ప్రశ్నలను చివరి అరగంటలో మాత్రమే పూర్తి చేయాలని తెలిపారు. ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించిన టైం టేబుల్ రోజుల్లో ఎలాంటి సెలవులు ఉన్నా పరీక్షలు కొనసాగిస్తామని చెప్పారు.