జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్

జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్
  • ప్రకటించిన టీఎస్​పీఎస్సీ563 పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్​
  • కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీని టీఎస్​పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 9న నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవలే టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ  ప్రారంభమైంది. వచ్చే నెల 14 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ క్రమంలోనే జూన్ 9న  ప్రిలిమ్స్  పెడ్తామని కమిషన్​ వెల్లడించింది. దీంట్లో 1:50 రేషియోలో ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్​లో నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్​ వెల్లడించింది. 

‘గ్రౌండ్ వాటర్’ పోస్టుల ర్యాంకులు రిలీజ్​

గ్రౌండ్ వాటర్ డిపార్ట్​మెంట్​లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్​మెంట్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసింది. 

గెజిటెడ్ కేటగిరీలో అసిస్టెంట్ హైడ్రోమెట్రా లజిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్, నాన్ గెజిటెడ్​ కేటగిరీలో టెక్నికల్ అసిస్టెంట్  హైడ్రో జియాలజి, హైడ్రోలజీ, జియోఫిజిక్స్, ల్యాబ్ అసిస్టింట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు వేర్వేరు ర్యాంకింగ్ లిస్టులు విడుదల చేసింది. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది.