గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి TSPSC కసరత్తు

గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి TSPSC కసరత్తు

తెలంగాణలో గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) కసరత్తు చేస్తోంది. సంక్రాంతి ముందే ఈ ఫలితాలను వెల్లడించేందుకు అధికారుల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలు వెల్లడికి టీఎస్పీఎస్సీకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. స్థానికత వివాదంపై కోర్టు ఆదేశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కోర్టు ఆదేశాలు,గ్రూప్–1 ఫలితాల విడుదలపై టీఎస్పీఎస్సీ అధికారుల సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు..

ఓ అభ్యర్థి స్థానికత వివాదం నేపథ్యంలో TSPSC అప్పీలుపై జనవరి నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్‌ దాఖలు చేయాలని TSPSCకి ఆదేశించింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామన్న హైకోర్టు.. ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. కాగా.. 503 గ్రూప్‌–1 సర్వీసుల పోస్టులకు అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రాథమిక కీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో TSPSC గ్రూప్–1 రిజల్ 2023 ఏ క్షణమైనా విడుదలయ్యే కావొచ్చని తెలుస్తోంది.