హైదరాబాద్, వెలుగు: పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన కేసులో అరెస్ట్ అయిన బీజేవైఎం కార్యకర్తలకు బెయిల్ లభించింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, అధికార ప్రతినిధి శివశంకర్, బి. పవన్ రెడ్డి, ఎనుగంటి రాజునేత, ముద్దడు మన్మధరావు, పూజారి రాముయాదవ్ సహా మొత్తం 10 మందికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు ఇద్దరి ష్యూరిటీస్తో పాటు రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి నెల 3వ ఆదివారం బేగంబజార్ పోలీసుల ఎదుట హాజరుకావాలని పేర్కొంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది.
