టీఎస్​పీఎస్సీ వెటర్నరీ సర్జన్ నోటిఫికేషన్

టీఎస్​పీఎస్సీ వెటర్నరీ సర్జన్ నోటిఫికేషన్

వెటర్నరీ అండ్​ పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(క్లాస్- ఎ & బి)పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. డిసెంబర్‌‌ 30 నుంచి 2023 జనవరి 19 వరకు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి. పోస్టుల భర్తీకి రాతపరీక్ష 2023 మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఖాళీలు: 170  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్- ఎ) పోస్టులకు  బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 15  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ -బి) జాబ్స్​కు  బ్యాచిలర్ డిగ్రీ (వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ), పీజీ లేదా పీజీ డిప్లొమా, మాస్టర్​ డిగ్రీ లేదా ఎంవీఎస్సీ(వెటర్నరీ పబ్లిక్ హెల్త్‌‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

సెలెక్షన్​: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఆధారంగా ఎంపిక చేస్తారు. పేపర్-1లో జనరల్ స్టడీస్​లో, పేపర్-2లో వెటర్నరీ సైన్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

హార్టికల్చర్ ఆఫీసర్స్​

డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ నియంత్రణలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది. బీఎస్సీ(హార్టికల్చర్‌‌) ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 3 నుంచి జనవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఏప్రిల్​ 4న నిర్వహించనున్నారు. వివరాలకు .www.tspsc.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.