
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తి చెక్కును ఆపేశానన్నారు. ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చి చెక్ రాలేదని అడిగాడని.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కళ్యాణలక్ష్మి చెక్కు ఎందుకు అన్నానని చెప్పాడు. ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావంటూ అడిగానన్నారు బాజిరెడ్డి. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని అన్నారు.