నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు.. బస్సులో మర్చిపోయిన 5 తులాల గోల్డ్​ అప్పగింత

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు.. బస్సులో మర్చిపోయిన 5 తులాల గోల్డ్​ అప్పగింత

లక్షెట్టిపేట వెలుగు: ప్రయాణికులు బస్సులో మర్చిపోయిన బంగారాన్ని తిరిగి వారికి అందించి ఆర్టీసీ ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. లక్సెట్టిపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబం కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, ఆపై బస్టాండ్ లో దిగి ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఐదు తులాల బంగారం ఉన్న హ్యాండ్ బ్యాగ్ లేదని గుర్తించారు. 

వెంటనే బస్టాండ్ కి చేరుకొని ట్రాఫిక్ గైడ్ రవీందర్​కు సమాచారం ఇచ్చారు. దీంతో రవీందర్ ఆ బస్సు డ్రైవర్​కి ఫోన్ చేసి బస్సులో వెతకమని చెప్పాడు. బస్సులో హ్యాండ్ బ్యాగ్ కనిపించడంతో బ్యాగ్ తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. డ్రైవర్ ముజ్జినొద్దీన్, కండక్టర్ విఠల్ ఆ బ్యాగును తీసుకువచ్చి రవీందర్ కు అప్పచెప్పగా.. ఆయన ఆ బ్యాగును వ్యాపారికి అందించాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందంతో ఆ ముగ్గురిని సన్మానించారు.