అద్దె బస్సుల సమ్మె లేదు.. వారంలో సమస్యలు పరిష్కరిస్తం

అద్దె బస్సుల సమ్మె లేదు.. వారంలో సమస్యలు పరిష్కరిస్తం
  • సమస్యలు వారంలో పరిష్కరిస్తం
  • ఇందుకోసం ఓ కమిటీ వేశాం
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి

హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన అద్దెబస్సుల యజమాన్యాల సమ్మెకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బ్రేకులు వేశారు. ఇవాళ అద్దె బస్సుల యాజమాన్యం సంఘంతో బస్ భవన్ లో సజ్జనార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సజ్జనార్  మాట్లాడుతూ.. అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. దీని కోసం  ఒక కమిటీని వేస్తామని తెలిపారు. జనవరి 5 నుంచి యధావిధిగా అద్దెబస్సులు నడుస్తాయని, ఎలాంటి సమ్మె ఉండదని అన్నారు.

సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని సజ్జనార్ వెల్లడించారు. పండుగ కోసం స్పెషల్ బస్సులను తిప్పుతామని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దెబస్సులు రన్ చేస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి స్కీంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని దీంతో  బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించకపోతే జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ చర్చలతో సమ్మెకు బ్రేకులు పడటం విశేషం.