
హైదరాబాద్, వెలుగు : అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్ సెట్-2023 పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రిజల్ట్స్ ను www.telanganaset.org వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్సెట్ మెంబర్ సెక్రెటరీ మురళీ కృష్ణ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలతో సెట్ స్కోర్ ను తెలుసుకోవచ్చని చెప్పారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. సెట్ పరీక్షను అక్టోబర్ 28,29,30 తేదీల్లో 29 సబ్జెక్టుల్లో నిర్వహించగా 31,866 మంది హాజరయ్యారు.