టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,601 ఉద్యోగాలు

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,601 ఉద్యోగాలు

నిరుద్యోగులకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో 1553  జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పింది. రాతపరీక్ష, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జూనియర్‌లైన్‌ మ్యాన్‌ ఉద్యోగాలకు పదో తరగతితో పాటు ఐటీఐ (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు. 

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌లో డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌) ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండొచ్చు.