కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ధర్నా

కలెక్టరేట్ల ఎదుట  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ధర్నా

ఆదిలాబాద్​టౌన్​, నిర్మల్  వెలుగు:  ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీఎస్​యూటీఎఫ్​, యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎస్​యూటీఎఫ్​ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్   కలెక్టరేట్​ ముందు ధర్నా నిర్వహించారు. 

 కాంగ్రెస్ సర్కార్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.  కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అశోక్, టీపీటీఎఫ్​ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.జ్ఞానేశ్వర్ , ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు జాదవ్ వెంకట్ రావు, జిల్లా యూఎస్ పీఎస్ నాయకులు దాసరి శంకర్, పెంట అశోక్, షబ్బీర్ అలీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నెల 23న హైదరాబాద్ లో చేపట్టనున్న రాష్ట్రస్థాయి మహా ధర్నాకు టీచర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. కలెక్టర్ ఆఫీస్ ఏఓకు వినతిపత్రం అందించారు.