ఛత్రపతి  శివాజీ  ప్రతిమను ఎవరూ అడ్డుకోలేదు

ఛత్రపతి  శివాజీ  ప్రతిమను ఎవరూ అడ్డుకోలేదు

తిరుమలలో  చోటు చేసుకున్న చత్రపతి శివాజీ   ఫోటో  వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు .  ఛత్రపతి  శివాజీ  ప్రతిమను ఎవరూ అడ్డుకోలేదన్నారు.  కొందరు  అత్యుత్సాహంతోనే టీటీడీపై  బురదజల్లే ప్రయత్నం  చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం  చేశారు. సోషల్  మీడియాలో జరుగుతున్న  తప్పుడు ప్రచారంపై  మండిపడ్డారు. కమ్యూనికేషన్  గ్యాప్ కారణంగానే  వివాదం తలెత్తిందన్నారు.  కేవలం  హిందూయేతర  సంస్థలకు చెందిన  వాటిని మాత్రమే  తిరుమలలోకి  అనుమతించబోమన్నారు. ఇవాళ పాలక  మండలి సభ్యుడు  మిలింద్ నర్వేకర్..ఈఓ  ధర్మారెడ్డికి ఛత్రపతి శివాజీ  ప్రతిమను  అందజేశారు.

అలిపిరి చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర భక్తుల వాహనాలపై చత్రపతి ఫోటోను తొలగిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ వివాదంపై  బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ కూడా ఫైర్ అయ్యారు.  ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరుతో తిరుపతికి చెడ్డపేరువస్తోందని ఆరోపించారు . తిరుమలకు ప్రతి రోజు యావత్ భారత దేశం నుంచి ఎంతో మంది భక్తులు వస్తారని.. అయితో  అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్ర భక్తులు తెస్తున్న శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్తున్నారన్నారు.శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద ఇష్యూగా మారిందన్నారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అని వైరల్ అవుతోందన్నారు. జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణని రాజాసింగ్ మండిపడ్డారు.