టీటీడీ సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత

V6 Velugu Posted on Apr 07, 2021

కరోనా కేసులు పెరుగుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్లు నిలిపివేయనుంది. ఈ నెల 11 సాయంత్రం వరకే టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతి నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో  సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్య‌లో భక్తులు క్యూలైన్లలో వేచిచూస్తున్నారు. దీంతో  కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గమనించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. 

Tagged AP, TTD

More News