శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​: తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరిస్తాం: ఆనం

శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​:  తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరిస్తాం: ఆనం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్​ న్యూస్​ ప్రకటించింది. స్వామిని దర్శించుకొనేందుకు చాలమంది వీఐపీ సిఫారస్​ లేఖలను ఉపయోగించుకుంటారు.  అయితే వేసవిసెలవుల్లో తిరుమలలో హెవీ క్రౌడ్​ ఉంటుంది. దీంతో టీటీడీ వీఐపీ లేఖల సిఫారస్​ ను తొలగించింది. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వీఐపీ లేఖలను పునరుద్దరిస్తున్నట్లు  టీటీడీ మే 15న ప్రకటించింది.  మే 16 నుంచి ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు . సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

ఏపీ, తెలంగాణ ప్రతినిధులకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది. మే 15 నుండి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరిస్తుంది. ఈ లేఖల ద్వారా దర్శనం మే 16 నుంచి ప్రారంభమవుతుంది.

 తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు రకాలుగా దర్శన ఏర్పాట్లు చేస్తుంది. వీటిల్లో వీఐపీ సిఫార్సు లేఖలు ఒకటి. వీఐపీలు సిఫార్సు చేసిన వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇటీవల వీఐపీ సిఫార్లు లేఖలను నిలిపివేశారు.

వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటీవల టీటీడీ సిఫార్సు లేఖలపై బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.