టైరు పేలి తుఫాన్ వెహికల్ బోల్తా..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో ప్రమాదం

టైరు పేలి తుఫాన్ వెహికల్ బోల్తా..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో ప్రమాదం
  • డ్రైవర్ కు తీవ్రంగా, మరో 9 మందికి స్వల్ప గాయాలు  

జహీరాబాద్, వెలుగు: తుఫాన్ వెహికల్ బోల్తాపడిన ఘటనలో 10 మంది గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన ప్రకారం.. తుఫాన్ వెహికల్ ప్రయాణికులతో సోమవారం కర్ణాటకలోని బాల్కి నుంచి హైదరాబాద్ వెళ్తుంది. 

జహీరాబాద్ మండలం ఉగేల్లి శివారులో జాతీయ రహదారిపైన ఒక్కసారిగా తుఫాన్ కుడి వైపు ముందు టైరు పేలడంతో  బోల్తా పడింది. డ్రైవర్ తో పాటు మరో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ గిరీశ్ కు తీవ్ర గాయాలవడంతో చికిత్స కోసం  హైదరాబాద్ కు తరలించారు. మిగిలిన ప్రథమ చికిత్స చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.