ఖమ్మం టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని ఎఫ్‌సీఐ గోదాం నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.3.5 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు కొత్త ఇళ్ల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
