జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : తుమ్మల నాగేశ్వరరావు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలోని వీడీఓఎస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం టీయూడబ్ల్యూయూజే(టీజేఎఫ్ 143) యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. మంత్రిని కలిసినవారిలో యూఐనియన్​ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం శ్రీనివాస్, జాతీయ కార్యవర్గ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

ఎరువులు సప్లయ్​ చేయాలని వినతి

ములకలపల్లి  : మండలంలోని మూఖమామిడి పామ్ ఆయిల్ ప్రొడ్యూసర్ సంఘానికి టీఎస్ మార్కెఫెడ్ నుంచి ఎరువులు సప్లయ్​ చేయాలని మంత్రి తుమ్మలకు మండల నాయకులు వినతి పత్రం అందజేశారు. శనివారం గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణను మండల నాయకులు కలిశారు. వారిలో మూకమామిడి ఎఫ్ పీఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కర్టూరి కృష్ణ, మాజీ పీఏసీఎస్​ అధ్యక్షుడు పర్వతనేని అమర్నాథ్, ఉపాధ్యక్షుడు పువ్వాళ మంగపతి ఉన్నారు. 

అరవింద్​రెడ్డి కుటుంబానికి పరామర్శ 

కూసుమంచి : తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామసహాయం అరవింద్ రెడ్డి తల్లి సునీతాదేవి ఇటీవల మృతి చెందిన విషయం తెలసిందే. శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. సునీతాదేవి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేశ్​రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, నల్లమల ఆనంద్, మద్దినేని మధు, విక్రమ్ రెడ్డి, నితీశ్​రెడ్డి పాల్గొన్నారు.