కరోనా ఎఫెక్ట్ తో ‘టండే కబాబీ’ షట్ డౌన్

కరోనా ఎఫెక్ట్ తో ‘టండే కబాబీ’ షట్ డౌన్

నోరూరించే కబాబ్స్ కు ‘టండే కబాబీ’ ఫేమస్
లక్నో: పవిత్ర రంజాన్ మాసంలో నోరూరించే కబాబ్స్, హలీం, బిర్యానీ ఫుడ్ లవర్స్ ను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పొడిగించే చాన్సెస్ ఎక్కువగా ఉండటంతో ఈసారి వాటి రుచి చూసే చాన్స్ లేనట్టే. మన హైదరాబాద్ బిర్యానీ లాగే లక్నోలోని టండే కబాబీ కూడా వరల్డ్ ఫేమస్. 115 ఏళ్ల హిస్టరీ కలిగిన టండే కబాబీ.. కరోనా కారణంగా తగిన మాంసం, స్టాఫ్ లేకపోవడంతో ఈసారి తమ సర్వీసులను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. రంజాన్ మాసానికి కబాబ్ లను అందించబోమని, తమ రెస్టారెంట్ షట్ డౌన్ చేస్తున్నామని టండే కబాబీ స్పష్టం చేసింది. ‘రోజ్ దార్స్ (సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఫాస్టింగ్ ఉండేవారు) కు కబాబ్స్ సర్వ్ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. రంజాన్ టైమ్ లో మా రెస్టారెంట్ కు వచ్చే ఇతర కస్టమర్స్ కూ కబాబ్స్ అందించలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. మా రెస్టారెంట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి’ అని టండే కబాబీ ఓనర్ మహ్మద్ ఉస్మాన్ తెలిపారు. లోకల్ సెల్లర్స్ మాంసాన్ని సప్లయి చేయలేకపోతున్నారని ఉస్మాన్ తెలిపారు. సాధారణ రోజుల్లో తాము 60 కేజీల మాంసాన్ని కబాబ్స్ కోసం ప్రిపేర్ చేస్తామని.. అదే రంజాన్ టైమ్ లో 100 కేజీలు అవసరమవుతుందన్నారు. ప్రస్తుతం అంత మాంసం దొరకడం లేదని పేర్కొన్నారు.