ఆటను.. అమ్మాయిని ఇద్దరిని సాధించాడు: స్కూల్ క్ర‌ష్‌తో CSK ప్లేయర్ ఎంగేజ్‌మెంట్

ఆటను.. అమ్మాయిని ఇద్దరిని సాధించాడు: స్కూల్ క్ర‌ష్‌తో CSK ప్లేయర్ ఎంగేజ్‌మెంట్

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఒకరివెంట మరొకరు పెళ్లి పనుల్లో నిమగ్నవుతున్నారు. టైటిల్ గెలించాం అన్న సొంతోషంలో వారి జీవితంలోకి మరొకరిని ఆహ్వానిస్తున్నారు. పది రోజుల క్రితం సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్‌ గైక్వాడ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు ఉత్కర్ష పవార్‌ను రుతురాజ్ మనువాడాడు. తాజాగా, మరొక ఆటగాడు కూడా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. 

సీఎస్‌కే యువ పేసర్ తుషార్‌ దేశ్‌పాండే త‌న స్కూల్ క్ర‌ష్‌ నభా గద్దాంవార్‌ను మనువాడనున్నాడు. ముంబై వేదికగా వీరి ఎంగేజ్‌మెంట్  ఘనంగా జరిగింది. ఈ వేడుక‌కు ప‌లువురు చెన్నై సూప‌ర్ కింగ్స్ క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. వీరిద్దరి మధ్య ప్రేమ స్కూల్ డేస్‌లోనే మొదలైందట. తుషార్.. తన ప్రేమ కోసం చదువును కూడా పక్కన పెట్టేసేవాడట. కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ కూడా డుమ్మా కొట్టి లైన్ వేసేవాడట. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను దేశ్‌పాండే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 'నా స్కూల్ క్రష్‌ నుంచి నా ఫియాన్సీగా ఆమెకు ప్రమోషన్‌ వచ్చింది..' అని క్యాప్షన్‌ జోడించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 విజేతగా నిలవడంలో దేశ్‌పాండే కీలక పాత్ర పోషించాడు. మొదటి రెండు మ్యాచులు నిరాశపరిచినా.. రాను రాను జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు. సీఎస్‌కే జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ కూడా దేశ్ పాండేనే. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన తుషార్‌ 21 వికెట్లు తీశాడు.